జులపల్లిలో ఘనంగా మహిళా దినోత్సవం
PDPL: కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోలుదాసరి వనితను శాలువాతో సన్మానించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వీవోఏలు, గ్రామపంచాయతీ సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజమహేంద్రర్, వార్డు సభ్యులు రమ, జీవనజ్యోతి, లక్ష్మి, పద్మ, రాజు, తదితరులు పాల్గొన్నారు.