మాజీ సర్పంచ్ ఇంట్లో 11 అడుగుల తోటకూర

W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో మాజీ సర్పంచ్ గాదిరాజు వెంకట సత్య సూర్యనారాయణ రాజు నివాసంలో 11 అడుగుల తోటకూర మొక్క కనువిందు చేస్తుంది. రెండు నెలల క్రితం తోటకూర విత్తనాలు చల్లగా అందులో ఒక మొక్క భారీగా పెరిగింది. దీంతో చుట్టుపక్కల జనాలు మొక్కను చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. కొందరైతే ఫోటోలు దిగి ఆనందపడుతున్నారు.