VIDEO: బందోబస్తు పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ

VIDEO: బందోబస్తు పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ

MDK: హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో గురువారం పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఓటింగ్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పి మహేందర్ పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.