పెద్దపల్లి, ఏటూరునాగారంలో ఆర్టీసీ డిపోలు: మంత్రి పొన్నం

WGL: కొత్తగా రెండు ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా తనకు సంతృప్తినిస్తోందని చెప్పారు. 10 నుంచి 15 ఏళ్లుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్నట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పెద్దపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.