కేటీఆర్ రోడ్‌షోను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ.. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టనున్న రోడ్‌షోను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.