బీడీ కార్మికురాలి కొడుకు నాలుగు ఉద్యోగాలు
SDPT: బీడీ కార్మికురాలి కొడుకు పోటీ పరీక్షల్లో 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడకు చెందిన రమేష్ గ్రూప్-2, 3, 4, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు పిడిశెట్టి రాజు ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ.. ఇష్టంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లి దండ్రుల పేరు నిలబెట్టారని స్థానికులు కొనియాడారు.