ఎట్టకేలకు రహదారి విస్తరణ పనులు ప్రారంభం
ASR: పాయకరావుపేట పట్టణం ప్రధాన రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. స్థానిక వై జంక్షన్ నుంచి తాండవ వంతెన వరకు రెండు కిలోమీటర్ల పొడవునా 16 మీటర్ల వెడల్పుతో రహదారిని విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. రహదారి విస్తరణకు మొదటి విడతలో రూ.5.25 కోట్లు నిధులు విడుదలైనట్లు చెప్పారు. టెండర్ల ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా జాప్యం జరిగినట్లు వెల్లడించారు.