ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసిన ఆర్డీవో
VZM: చీపురుపల్లి నూతన RDOగా భాద్యతలు స్వీకరించిన సుధారాణి ఆదివారం సాయంత్రం స్దానిక MLA కిమిడి కళా వెంకటరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో రెవెన్యూ సంబంధమైన సమస్యలపై దృష్టి సారించాలని, అలాగే ప్రభుత్వ పథకాలు గ్రామంలో లబ్ధిదారులకు అందేలా చూడాలని ఎమ్మెల్యే ఆమెకు సూచించారు.