పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
KMR: పిట్లం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం స్టేషన్ రికార్డులు, పార్కింగ్ ప్లేస్‌ను పరిశీలించి, విధి నిర్వహణలో పోలీసులు ప్రజలతో మర్యాదగా ఉండాలని అన్నారు.