రహదారిపై నిలిచిన మురుగు నీరు..!

రహదారిపై నిలిచిన మురుగు నీరు..!

మేడ్చల్: చిలుకానగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో వైన్స్ ఎదురుగా రహదారిపై వరద, డ్రైనేజీ నీరు విపరీతంగా నిండిపోయిందని స్థానికులు తెలిపారు. నీరు పోయేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో, అటువైపు నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై వెంటనే జిహెచ్ఎంసి, HMWSSB అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి చేశారు.