జిల్లా కోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపు
వరంగల్ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టు ఆవరణను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. న్యాయవాదులు, కక్షిదారులు భయాందోళనకు గురవ్వగా.. భద్రతను భారీగా పెంచారు. బెదిరింపు కాల్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.