బద్వేల్‌లో చెత్త వర్గీకరణపై అవగాహన
KDP: స్వచ్ఛ సర్వేక్షన్-2026 లక్ష్యంగా బద్వేల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చెత్త వర్గీకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వార్డు స్థాయిలో స్వయంగా పాల్గొని తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరు చేయాల్సిన విధానాన్ని ప్రజలకు వివరించారు. అలాగే పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణను పర్యవేక్షించారు.