మనుబోలులో ఎడతెరిపిలేని వర్షం

మనుబోలులో ఎడతెరిపిలేని వర్షం

NLR: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో మనుబోలు మండల వ్యాప్తంగా రాత్రంతా భారీ వర్షం కురుస్తూనే ఉంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ముసురు పట్టుకుంది. వాతావరణం ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో చలిగాలి వీస్తుంది. భారీ వర్షాల వల్ల రాత్రంతా కరెంటు లేక ఇబ్బంది పడ్డారు. వీధుల్లో రోడ్లపై జనం లేకపోవడంతో జనజీవనం స్తంభించింది.