పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టవారిపాలెం గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు బెజవాడ రామారావు అనే రైతు మృతి చెందాడు. పశువులను మేతకు తీసుకువెళ్లి వర్షం సమయంలో చెట్టు కింద ఉన్న రామారావుపై అకస్మాత్తుగా పిడుగు పడింది. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.