VIDEO: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
కృష్ణా: డోకిపర్రులో కొందరు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు రూరల్ సీఐ సోమేశ్వరరావు 9 మందిపై దాడి చేసి, మంగళవారం వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించిన, అమ్మిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం 9 మందిని కోర్టు ముందు హాజరు పరిచారు.