తర్లుపాడు ఎంపీడీవోగా జయరాం నాయక్ బాధ్యతలు
ప్రకాశం: తర్లుపాడు మండల ఎంపీడీఓగా డి. జయరాం నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఎంపీడీఓ తెలిపారు.