మరింత పెరగనున్న రీఛార్జ్ ధరలు!
మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు త్వరలో పెరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. Jio, Airtel, VI టారిఫ్‌ను 10 నుంచి 12శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తక్కువ ధరలలో ఉన్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను ఇప్పటికే కంపెనీలు తొలగించిన సంగతి తెలిసిందే. మరోవైపు పేమెంట్ యాప్ లోనూ 'రీఛార్జ్ ధరలు పెరగొచ్చు' అంటూ అలర్ట్స్ వస్తుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.