ఆరు నెలలు గడుస్తున్నా.. పనులు శూన్యం!

ఆరు నెలలు గడుస్తున్నా.. పనులు శూన్యం!

MDCL: రామంతపూర్ పరిధిలోని వాసవి నగర్ వీధి నెంబర్ 1లో రోడ్డు అధ్వానంగా మారిందని స్థానికులు తెలిపారు. పైపులైన్ నిర్మాణం పూర్తయినప్పటికీ రోడ్డు మరమ్మతులు చేపట్టలేదని పేర్కొన్నారు. దాదాపు 6 నెలల సమయం గడుస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.