మార్కెట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

మార్కెట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

NLR: బుచ్చిపట్టణంలో నిర్మిస్తున్న నగర పంచాయతీ కూరగాయల మార్కెట్‌ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ విధివిధానాలపై ఆరా తీశారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లే రోడ్డును పరిశీలించారు. మార్కెట్ నిర్మాణం పూర్తయ్యాక రోడ్డును నలభై అడుగుల వెడల్పు చేస్తామని అన్నారు. ఆమె మాట్లాడుతూ.. మరో నెలలోనే మార్కెట్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.