ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అటకెక్కింది: బొత్స
AP: కూటమి పాలనపై పోరాటం చేసే సమయం ఆసన్నమైందని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 'ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి హామీ పూర్తి స్థాయిలో అమలవుతుందా? పొదుపు గ్రూపులో సున్నా వడ్డీ వస్తుందా? ఆరోగ్యశ్రీ అటకెక్కింది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేదవాడి ఆరోగ్యం ఏమవ్వాలి? నాడు జగన్ పాలనలో అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇచ్చారు' అని బొత్స గుర్తు చేశారు.