బడా గణపతిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్

HYD: ఖైరతాబాద్ మహాగణపతిని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం బడా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు గణపతి ప్రతిమని మహేష్ కుమార్ గౌడ్‌కి బహుకరించారు.