'కొండవీదిలో అంగన్వాడీ భవనంను పూర్తి చేయాలి'
ASR: డుంబ్రిగూడ మండలం అరకు గ్రామంలోని కొండవీదిలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణంను పూర్తి చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీపీ చట్టారి సాయిబాబా, చిన్నస్వామి ఇవాళ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవనం లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాత్కాలిక ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోందని, తక్షణమే అధికారులు స్పందించాలని కోరారు.