పాఠశాలకు కంప్యూటర్, ప్రింటర్ వితరణ

పాఠశాలకు కంప్యూటర్, ప్రింటర్ వితరణ

అనకాపల్లి: మాకవరపాలెం మండలంలోని జంగాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు కంప్యూటర్, ప్రింటర్‌ను అందించారు. గ్రామానికి చెందిన సింగంపల్లి సత్యనారాయణ, రాయి అర్జున్ రూ.40వేలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్లను బుధవారం పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు జాన్ ప్రసాద్, మూర్తి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.