బస్సు ప్రమాదం.. నేడు మృతదేహాలు అప్పగింత.!
మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహాలను నేడు బంధువులకు అప్పగించే అవకాశమున్నట్లు అధాకారులు వెల్లడించారు. డీఎన్‌ఏ నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నివేదిక రాగానే బంధువులకు మృతదేహాలు అప్పగిస్తామని వారు పేర్కొన్నారు. కాగా, రాయవరంలో నిన్న టిప్పర్-ట్రావెల్స్ బస్సు ఢీకుని 14 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే.