ఉపాధి హామీ పని ప్రదేశం పరిశీలన

ఉపాధి హామీ పని ప్రదేశం పరిశీలన

KMM: బూర్గంపాడు మండలం మోతేపట్టి నగర్‌లో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు మంగళవారం సందర్శించారు. రెండు వారాల నుంచి కార్మికుల ఖాతాలో డబ్బులు పడకపోవడంతో అధికారులను అడిగితే డబ్బులు లేవని చెప్పడం దారుణమని ఆయన మండిపడ్డారు. కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.