నేడు వాలీబాల్ సెలక్షన్ పోటీలు
E.G: ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, బాలికల వాలీబాల్ ఎంపికలు గురువారం నిర్వహించనున్నట్లు డీఈఓ సలీం భాషా తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపికలు జరుగుతాయన్నారు. 2008 జనవరి 1 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులు. క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.