అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్ లారీలు స్వాదీనం

ప్రకాశం: మద్దిపాడు మండలంలోని బూరెపల్లిలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలను ఎస్సై శివరామయ్య బుదవారం స్వాధీనం చేసుకున్నారు. ఓ కొండ ప్రాంతం వైపునుంచి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. స్వాధీనం చేసుకున్న టిప్పర్ లారీలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.