OLX మోసం కేసులో నిందితుడు అరెస్ట్
VZM: OLX ద్వారా ద్విచక్ర వాహనాల కొనుగోలు పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడు చల్లా శంకర్ చరణ్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ శుక్రవారం తెలిపారు. విజయనగరం, గరుగుబిల్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.60 వేలు, రూ.75 వేలు పంపించి మోసపోయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు.