కంతపోలమ్మతల్లి గ్రామ దేవతను దర్శించుకున్న ఎమ్మెల్యే

కంతపోలమ్మతల్లి  గ్రామ దేవతను దర్శించుకున్న ఎమ్మెల్యే

PPM: సీతానగరం మండలం బగ్గందొరవలస కంతపోలమ్మతల్లి గ్రామ దేవతను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం దర్శించుకున్నారు. ఈ గ్రామ దేవత పండగ సందర్భంగా అమ్మవారి ఘటాలను దర్శించుకొని, వాటిలో పండ్లు, పుష్పాలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ దేవత కమిటీకి తన వంతు విరాళంగా రూ.20,000/- నగదును అందజేశారు.