నేడు సీఎంను కలవనున్న శ్రీచరణి
KDP: ప్రపంచకప్ విజేత భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి నేడు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ఆమెను ప్రభుత్వ పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం ఏసీఏ ఆధ్వర్యంలో గన్నవరం నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ జరగనుంది. శ్రీచరణి ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలుసుకుంటారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రభుత్వం నుంచి భారీ నజరానా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.