ఈనెల 28 నుంచి రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు
ASF: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ టోర్నీ నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి గంగాధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 నుంచి 30 వరకు జరిగే పోటీల కోసం మైదానంలో మూడు మొత్తం కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ నుంచి 450 మంది క్రీడాకారులు, హాజరవుతారని పేర్కొన్నారు.