హిందీ బాక్సాఫీస్ వద్ద ధనుష్ సునామీ
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన హిందీ చిత్రం 'తేరే ఇష్క్ మే'. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభిస్తోంది. తొలి వీకెండ్‌లోనే ఈ సినిమా రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. నిన్న వర్కింగ్ డేలో కూడా రూ. 8.39 కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది. ఫుల్ రన్ పూర్తయ్యే లోపు ఈ చిత్రం రూ. 125 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంది.