VIDEO: డీకే బద్రీనారాయణ మృతికి ఎమ్మెల్యే అమర్ సంతాపం
CTR: చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త , డీకే. బద్రీ నారాయణ మృతి పట్ల పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. మాజీ ఎంపీ డీకే ఆడికేశవులు నాయుడు సోదరుడైన డీకే. బద్రీ నారాయణ శుక్రవారం ఆకస్మిక మృతి చెందడంతో వారి స్వగహానికి చేరుకొని ఆయనకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.