ఎదురుకాల్పులు.. మావోయిస్టు కీలక నేత మృతి

ఎదురుకాల్పులు.. మావోయిస్టు కీలక నేత మృతి

జార్ఖండ్ పాలము జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నిషేధిత సీపీఐ(మావోయిస్టు) కమాండర్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో రూ.15 లక్షల రివార్డు ఉన్న మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. వారి నుంచి పలు రకాల ఆయుధాలు, రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.