పెళ్లికి ముందే వరుడు పరార్

SDPT: పెళ్లికి నాలుగు రోజుల ముందే వరుడు మరో యువతితో పరారైన ఘటన చేర్యాల మండలంలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని యువకుడితో చేర్యాల పట్టణంలో నేడు వివాహం జరిపించేందుకు అమ్మాయి తరపు వారు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమిస్తున్న మరదలితో వరుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు చేర్యాల పోలీసులను ఆశ్రయించారు.