అసంపూర్తిగా విలేజ్ క్లినిక్ భవనం
SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన విలేజ్ క్లినిక్ భవనం ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. సివిల్ పనులు ఎక్కువగా పూర్తయినా భవనం పాడవుతుండటంతో, వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అసంపూర్తి భవనాల జాబితాను ఉన్నతాధికారులకు పంపినట్లు మండల ఇంజినీరింగ్ అధికారి సూర్యచంద్ర రావు తెలిపారు.