తిరుమలకు వెళ్లని ఈ గ్రామం..?

తిరుమలకు వెళ్లని ఈ గ్రామం..?

GDWL: తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్తుంటారు. కానీ తెలంగాణలోని మల్దకల్ ఊరి ప్రజలు తిరుమలకు వెళ్ళరు. ఈ గ్రామంలో వెలసిన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలసిన తిమ్మప్పను తిరుమలేశుడిగా భావించి పూజిస్తారు. డిసెంబర్ నెల పౌర్ణమి రోజున ఇక్కడ వైభవంగా తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. ఇక్కడి ప్రత్యేకత ఆలయం గోపురం కంటే ఇళ్ళను ఎత్తుగా నిర్మించరు.