'పూరి సేతుపతి' మూవీ.. 5 నెలల్లో షూటింగ్ పూర్తి

'పూరి సేతుపతి' మూవీ.. 5 నెలల్లో షూటింగ్ పూర్తి

విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఎన్నో నెలల ప్రయాణం.. మరెన్నో ఆనందకరమైన అనుభవాలతో ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు తెలిపింది. త్వరలోనే వరుస అప్‌డేట్స్ రానున్నాయని.. అందరూ వేచి ఉండండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.