'శ్రావణమాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాం'

'శ్రావణమాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాం'

KDP: గండి క్షేత్రంలో ఈ నెల 25 నుంచి జరగనున్న శ్రావణమాస ఉత్సవాలకు ఏర్పాట్లను ముమ్మరం చేశామని ఈవో వెంకటసుబ్బయ్య గురువారం తెలిపారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది 5 శ్రావణ శనివారాలు వచ్చాయన్నారు. ఈ ఉత్సవాలను అందరి సహకారంతో విజయవంతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.