'అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక చేస్తే కఠిన చర్యలు'

NGKL: ఇందిరమ్మ గృహాల సర్వే పారదర్శకంగా ఉండాలని, అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతి పేటలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.