ఇందిరా, రాజీవ్ ప్రాణత్యాగం చేశారు: జగ్గారెడ్డి
TG: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గాంధీ కుటుంబంలో ముగ్గురికి ఎంపీ పదవులు తప్పా? అని ప్రశ్నించారు. స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ కుటుంబం ప్రధాన పాత్ర పోషించిందన్నారు. ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. HYDలో ఐటీ అభివృద్ధికి రాజీవ్ గాంధీ పునాదులు వేశారన్నారు.