అక్రమంగా ఇసుక తరలించిన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు

అక్రమంగా ఇసుక తరలించిన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు

KNR: అక్రమంగా ఇసుక రవాణా చేసిన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చేగుర్తిలోని మానేరు వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఇటీవల పట్టుబడ్డ చామనపల్లి బాబు అనే వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.