GHMCలో డివిజన్ల పునర్విభజన వ్యతిరేకత..!
HYD: జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజన గందరగోళంగా మారింది. దీనిపై ప్రతిపక్షం, విపక్షాలతోపాటు అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకత తెలిపారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఇష్టం వచ్చినట్లు పునర్విభజన చేశారని మండిపడ్డారు. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు జీహెచ్ఎంసీ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రజాప్రతినిధులను సంప్రదించిన తర్వాతే పునర్విభజన చేపట్టాలని కోరారు.