వాగుల ఉధృతి తగ్గక ప్రజలు ఇబ్బందులు
ASR: మొంథా తుపాన్ ప్రభావం తగ్గిపోయినా, దాని చేదు అనుభవాలు చింతపల్లి మండలంలోని ఎర్రబొమ్మలు పంచాయతీ ఎర్నాపల్లి గ్రామ ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయి. తుపాన్ సమయంలో కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామ పరిసర ప్రాంతాల్లోని రెండు వాగులు వరదతో ఉప్పొంగి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలన్న ఇబ్బందులు తప్పడం లేదు.