VIDEO: మదనపల్లెలో స్టాల్స్‌పై ఉద్రిక్తత
అన్నమయ్య: మదనపల్లెలో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను స్థానిక వ్యాపారుల అసోసియేషన్ అడ్డుకుంది. తక్కువ ధరలతో తమకు నష్టం జరుగుతుందని వారు నిరసన చేపట్టారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచే ప్రయత్నం చేశారు. స్టాల్స్ నిర్వహకులు తాము చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నామని తెలిపారు.