837 కేసులు పరిష్కారం: జడ్జి
NLG: దేవరకొండలో ఇవాళ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 837 కేసులు పరిష్కారమైనట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, సివిల్ జడ్జి కే. అనిత తెలిపారు. కక్షిదారులు రాజీ మార్గాన్ని అనుసరించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సివిల్ సూట్ 11, క్రిమినల్ కేసులు 142, సీసీ అడ్మిషన్స్ 55, ఈ-పెట్టీ కేసులు 623, పీ.ఎల్.సీ 5 కేసులు పరిష్కారమైనట్లు వెల్లడించారు.