VIDEO: సిరిసిల్లలో అదుపుతప్పిన కారు..!

VIDEO: సిరిసిల్లలో అదుపుతప్పిన కారు..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.