నిధుల మంజూరుకు సీఎంకు వినతి పత్రం అందజేత

GNTR: సీఎం నారా చంద్రబాబును పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల అనుమతులు, నిధుల మంజూరుపై ఆయన సీఎంకు వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే నరేంద్ర తెలిపారు.