VIDEO: పెట్రోల్ బంకుల్లో బారులు తీరిని వాహనాలు
ASF: పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా ఆగిపోయిందని కొరత ఏర్పడుతుందని, ధరలు పెరుగుతాయనే ఊహాగానాలతో ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో కొన్ని చోట్ల "నో స్టాక్" బోర్డులు దర్శనమిచ్చాయి. తెరచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహదారులు పోటెత్తారు.