'భవిష్యత్‌లో నగరవాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయ్'

HYD: భవిష్యత్‌లో నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు CM రేవంత్ నేడు గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, ఫేజ్ 3కి శంకుస్థాపన చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు 20 TMCల నీరు తరలించే బృహత్కర కార్యక్రమం ఇది. 17.50 TMCలు తాగునీటి అవసరాలు, 2.50 TMCలు మూసీ పునరుజ్జీవనం కోసం వినియోగిస్తారు.